![]() |
![]() |

ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ చాల ఫన్నీగా సాగిపోయింది. ఇందులో సద్దాం వేసిన జోక్స్ కి ఆడియన్స్ పడీపడీ నవ్వుకున్నారు. కీరవాణి తనకు మామ అవుతాడని కూడా చెప్పాడు. ఈ షోకి ఎంట్రీ ఇచ్చిన సద్దాం "కీరవాణి గారిని నేను వాణి అని పిలుస్తాను.. ఆయన అసలు పేరు వాణి..ఆయన కీరాలు బాగా గట్టిగా తింటాడు కాబట్టి కీరవాణి అయ్యాడు. బేసిక్ గా ఆయన నాకు మామ. ఒకసారి బాహాబాబు కంపోజింగ్ జరుగుతున్నప్పుడు మామ, నేను, రాజమౌళి గారు అందరం కూర్చుని ఉన్నాం..అప్పుడు ఎందుకో నేను డల్ గా ఉంది బాధపడుతున్నా...ఏంటి అల్లుడు బాధపడుతున్నావ్ అని అడిగాడు. ఎం లేదు మామ నేను ఒక సినిమా ఒప్పుకున్నా.
ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి మధ్య ఇరుక్కుపోయాయి అని చెప్పా. వెంటనే కీరవాణి మామ నా పీక పట్టుకున్నాడు..అప్పుడు ఇరుక్కుపో అనే సాంగ్ లైన్ వచ్చింది.. అదే బాహుబలిలో కంపోజ్ చేశారు. మొత్తం సెట్ లో బల్లులు, ఎలకలు ఉంటాయా..ఒకసారి బల్లి కింద పడింది..మామ బల్లి బల్లి అన్నాను.. అంతే బలిబలిబలిరాబలి...సాహోరే బాహుబలి అనే సాంగ్ రాసేశారు...ఇక మా బాబాయ్ తమన్ గురించి చెప్పాలంటే..ఒక మూవీ గురించి నేను బాబాయ్ కూర్చున్నప్పుడు టీ తెమ్మని చెప్పాను..అక్కడ ఒకతను దుప్పటి కప్పుకుని కూర్చున్నాడు. ఇక మా దగ్గరకు రకరకాల టీలు వస్తూ ఉన్నాయి.. అప్పుడే ఈ లైన్ వచ్చింది సిమ్మటి సీకటి..కమ్మటి సంగటి అని సాంగ్ ని కంపోజ్ చేశారు" అంటూ సద్దాం సరదాగా వాళ్ళతో కామెడీ రిలేషేన్స్ కంటెంట్ ని జెనెరేట్ చేసి నవ్వించాడు.
![]() |
![]() |